An advice to Ja…

An advice to Jana Sena !!!

జన సేన పార్టీకి అధినేత ఒక Angry young man (ఆగ్రహ భార్గవుడు) కావడం సంతోషమే. ఢిల్లీ లోని AAP పార్టీకి కూడ నాయకులు ఆగ్రహ భార్గవులే. అయితే ఈ యువక ఆగ్రహాన్ని సక్రమంగా ఏకీకరించి, నియంత్రించి సదుపయోగమైన శక్తిగా మలచగలిగే బాధ్యత పూర్తిగా పార్టీ అధినేతదే. ఈ పని చేయడానికి అహరహం (24 గంటలూ) పార్టీ నాయకుడు శ్రమ పడవలసి ఉంటుంది. అన్నివైపులనుంచి ప్రతిఘటన, ప్రత్యేకంగా print and electronic media ల నుండి విమర్శలు, అబద్ధ ప్రచారాలను ఎదుర్కొనవలసి వస్తుంది. వీటిని ఎదుర్కొనే ప్రయత్నం లో అసలు ధ్యేయానికి, మూల ఆశయానికి పార్టీ దూరం అవడం తరచుగా సంభవిస్తుంది. ప్రస్తుతం AAP ఇదే పద్మవ్యూహంలో ఇరుక్కుని ఉంది. పవన్ సినిమా నట వ్యాపకానికి వెంటనే స్వస్తి చెప్పి 24 గంటలు పార్టీ పటిష్టతకు, అభివృద్ధికి కాలం వెచ్చించ వలసి ఉంది. పార్టీ నిర్వహణకు ఆవేశమొక్కటే పనిచేయదు. ప్రజా సంబంధాలకు భంగం లేకుండా కార్యకుశలత కావాలి. మేధావులను, మంచిసలహాదారులను కార్యవర్గంలోకి తీసుకోవాలి. Grass root స్థాయిలో పార్టీ కేడర్ ని పెంచుకోవాలి. ప్రాణాలర్పించడం వల్లనే దేశాభివృద్ధి జరగదు. దేశాభివృద్ధికి కావలసింది ప్రణాళికను అమలుచేయగల దీక్ష, నైపుణ్యం గల మానవశక్తి కావాలి. పాలనాదక్షత కావాలి.  గతంలో ప్రజా రాజ్యం వలన ప్రజలకు కల్గిన చేదు అనుభవాలే ఇప్పుడు కూడ ‘జన సేన’ వలన పునరావృతం అవుతాయని నకారాత్మకంగా ఆలోచించడ మెందుకు? కావాలంటే పార్టీని సమర్ధించవద్దు, కానీ కారణరహితంగా విమర్శించవద్దు కూడ. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. అన్నీ అందరకూ నచ్చవు. నచ్చిన దానికే ప్రజలు ఎలానూ ఓటు వేస్తారు. ఎవరో ఒకరు సాహసంతో  మంచిని చేస్తానంటే కొంతకాలం నమ్మడంలో తప్పులేదు. ఈ సారి నమ్మకద్రోహం జరిగితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. విమర్శలను, అవహేళనలను ఆపి కొంతకాలం వేచి చూడటం లో తప్పులేదు కదా!

Advertisements

‘కామా’ కి కాలం చెల్లిందా?

ఈమధ్యనే కొలంబియా యూనివర్శిటీ ప్రొఫెసర్ Jhon McWhorter అల్పవిరామచిహ్నం ‘కామా’కు కాలం చెల్లిందని, ఆంగ్లభాషకు దాని అవసరం ఇక ఏమాత్రం లేదని సలహా ఇచ్చారు. Comma ని వాడనంత మాత్రాన్న ఆధునిక అమెరికన్ ఆంగ్లభాష తన భావప్రకటన పాటవాన్ని కోల్పోయేది ఏమీలేదని అన్నారు.
గతంలో తెలుగులో ఒక ప్రసిద్ధ రచయిత – ‘ ఊరికి కరణం, భాషకి వ్యాకరణం శత్రువులు’ అన్నారు. ఆయన దీనిని ఏ సందర్భంలో ఏ అర్థంలో అన్నారో తెలియదు కానీ, దరిమిలా ఊరికి శత్రువులని భావించిన కరణాలు, కరణీకాలూ అంతరించాయి.
దేశానికి ఒక రాజ్యాంగం, రాజ్యాంగ సూత్రాలు ఎలా అవసరమో అలాగే ఏ భాషకైనా కొన్నినియమాలు నిబంధనలూ అవసరమౌతాయి. అప్పుడే అది భావవినియోగానికి అర్హమౌతుంది. ఐతే ఇప్పుడు సంప్రదాయాలను పాటించడం కంటే సంప్రదాయాలకు ఎదురుతిరిగడమే ఒక సాహసచర్యగా భావించబడుతోంది. ప్రతిదానికీ స్వేచ్ఛ కావాలి. ‘words’ ని ‘wrds’ అని ‘good’ కి gud అని ఇలా సంక్షిప్తీకరించిన అపభ్రంశాలు వాడటం ఆధునికతకు, సాంకేతిక వైశిష్ట్యతకు సూచికలుగా మారాయి. ‘ నేను రాస్తున్నది నాకూ,మీకూ అందరికీ అర్థమౌతున్నప్పుడు నిఘంటువులో నిర్దేశించిన మాదిరే spelling ఎందుకు రాయాలి?’- ఇదీ నేటి తరం వారి వాదన. న్యూమరాలజీ పై వ్యామోహం పెరిగిన సందర్భంలో కూడా చాలా మంది తమ పేర్లను వక్రీకరించుకోవడం సహజమై పోయింది. పేరుని బట్టి స్పెల్లింగ్ ని ఊహించడం అసాధ్యమైపోయింది. ‘Quality’ ని ‘kwality’ గా రాసేస్తున్నాం. ఒక ప్రక్క ప్రపంచవ్యాప్తంగా ‘spelling bee’ లాంటి పోటీలు పిల్లలకు నిర్వహిస్తూనే మరొకప్రక్క భాషవాడకం లో విశృంఖలతను ప్రోత్సహించడం ఎంతవరకు సబబు?
Comma అవసరం లేదంటున్నామీ రోజు!
విరామ చిహ్నాలు ఏ భాషకైనా అలంకారాలంటాను నేను. ఉదాహరణకు తెలుగు భాషనే తీసుకుందాం.
‘సరే దద్దోజనం అయిపోయిందా?’ అనేవాక్యం తీసుకుందాం. ఈవాక్యంలోనే ‘కామా’ విరామచిహ్నంగా రెండు రకాలుగా వాడి రెండర్థాలు వచ్చేలా రాయొచ్చు.
1. ‘ సరే, దద్దోజనం అయిపోయిందా?’
2. ‘సరే దద్దోజనం, అయిపోయిందా?’

A Lesson for a teacher.

నేర్వదగు నెవ్వరు చెప్పిన . . .

జూన్ రెండోవారం. వేసవి సెలవులు గడచి పోయాయి. స్కూళ్ళు తెరిచారు. రెండు నెలల స్తబ్ద జీవితం తర్వాత నూతన విద్యా సంవత్సరం మొదలైంది. కొత్తక్లాసులు మొదలయ్యాయి. ఇంకా కొత్తవాతావరణం, కొత్తవిద్యార్థులు. నవ్వులతో కేరింతలతోకొంతమంది విద్యార్థులు, సంకోచంతో, బెరుకుతో మరికొంతమంది. కాని నా మనసెంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. ఉపాధ్యాయినిగా, కో-ఆర్డినేటరుగా నా రొటీన్ బాధ్యతలకు పూర్తిగా సిద్ధం అయ్యాను.

ఇంతలో ప్రిన్సిపాల్ ఆఫీసు నుండి కబురు. ఒకసారి వచ్చివెళ్ళవలసినదిగా. వెళ్ళాను. ఆఫీసు మేనేజర్ నా ‘Appraisal form’ ఇచ్చి సంతకం పెట్టమని అడిగారు. అంతాచదివాను. ప్రిన్సిపాలు గారి సంతకం పైన వారి రిమార్క్ చదివాను. ‘ Scope for improvement’ అని. ఒక్కసారిగ హతాశురాలినయ్యాను. ఇంత వరకు నాలో ఉన్న ఉత్సాహమంతా నీరుకారిపోయింది. గత సంవత్సరమంతా నేను పడిన శ్రమంతా కళ్ళముందర కదిలింది. నా ఉత్సాహపు పొంగు నీటిబుడగైపోయింది. నేను చేసిన కఠిన పరిశ్రమకు కించిత్తు మెచ్చుకోలు నాపైవారినుండి నాకు లేకపోవడమే కాదు, పైపెచ్చు మనసును గుచ్చే వ్యాఖ్య కూడ దానికి తోడయ్యింది. ఏంచేయాలి? నన్ను నేనే నిందించుకోవడం మినహా. లేదా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళి పోవాలి. మనసులోనే బాధపడుతూ దూరంగా పోయి ప్లేగ్రౌండు పక్కనే ఉన్న చెట్టుక్రింద మౌనంగా చాలసేపు కూర్చున్నాను చిన్నబోయిన మనసుతో.

ఆ మర్నాడు నిరుత్సాహం నిండిన మనసుతోనే స్కూలుకు వెళ్ళాను. ఆరోజు నాలుగోతరగతి క్లాసుటీచరు ఆరోగ్యం బాగుండని కారణంగా సెలవుపెట్టింది. ఆక్లాసును నన్ను తీసుకోన్నారు. నిరాసక్తంగా నేను ఆ తరగతి గదిలోకి అడుగుపెట్టేసరికి తరగతిలోని విద్యార్థులంతా అప్పటికే తెల్లకాగితాలపై బొమ్మలు వేస్తూ డ్రాయింగ్ పనిలో పూర్తిగా లీనమైపోయి ఉన్నారు.

నన్ను చూస్తూనే అందులో ఒక విద్యార్థిని గబగబ నాదగ్గరకు వచ్చి తను అంతవరకు వేసిన బొమ్మ నాకు చూపించింది. ఆబొమ్మ – ఒక బాలిక బొమ్మ గీస్తున్నదృశ్యం – నాకు చూపించి నా మెప్పును పొందాలనే ఆశతో ఆవిద్యార్థిని నాదగ్గరకు వచ్చినట్లు నాకర్ధమైంది. బొమ్మలో భావం చక్కగా విదిత మౌతోంది. మనస్సులోని నా చీకాకును పక్కకునెట్టి చిరునవ్వుతో ” Excellent” అన్నాను. చిరునవ్వుతో వెలిగిన ముఖంతో సంతోషంగా తన సీటుకు వెళ్ళిపోయిందా అమ్మాయి. కొంతసేపయాక ఆవిద్యార్థిని సీటు పక్కగా నేను వెళ్ళడం సంభవించింది. ఆ అమ్మాయి ఇంకా తలొంచుకొని ఏకాగ్రతతో తనువేసిన ఆ బొమ్మమీదనే ఇంకా ఏవో కొత్త మెరుగులు దిద్దుతోంది. ఇప్పుడు ఆబొమ్మలో ఆకాశంలో మేఘాలు, దూరంగా ఎగురుతున్న పక్షులు, అక్కడక్కడా చెట్టూచేమలు చోటుచేసుకున్నాయి. నేను దగ్గరకు రాగానే అదే చిరునవ్వుతో ఆమె కళ్ళు నా మెప్పును ఆశిస్తున్నాయనిపించాయి. ఆమె వేసిన చిత్రాన్ని చూసి ” Excellent. Keep it up!” అన్నాను.

అంతలో గంట మోగడంతో నెమ్మదిగా staff room కి చేరుకున్నాను. అకస్మాత్తుగా ఎందుకో నా మనసు గాలిపింజలా తేలికైనట్లు అన్పించింది. ఒక గంట క్రితం నా మనసుని క్రమ్మిన మబ్బులన్నీ విడిపోయినట్లనిపించింది. ఉపాధ్యాయినిగా నా 10 ఏళ్ళ అనుభవం నేర్పని పాఠాన్ని ఈ పదేళ్ళ అమ్మాయి నాకు చెప్పిందనిపించింది. నాకివ్వబడిన రిమార్క్ కు ఈ అమ్మాయి ద్వారా నాకు ఒక కొత్త అర్థం స్ఫురించిందనిపించింది. బాగుందని మెచ్చుకున్నా ఆ అమ్మాయి ఆ చిత్రాన్ని ఆపి మరో బొమ్మని వేయకుండా అదే బొమ్మకు నూతన అలంకారాలను చేర్చి మరింత సొబగును తీసుకురావాలని ప్రయత్నం చేసింది.

నాపనిని విశ్లేషిస్తూ నాపై అధికారిణి చేసిన రిమార్క్ ను నేనింతవరకు అర్థం చేసుకున్నతీరు సరికాదని అర్థమైంది. మనం ఒక పనిని ఎంత పరిపూర్ణంగా చేసినా, అంతకంటె మెరుగైనరీతి లో ఆపని చేయడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుందనే నిజం మనసుకు తట్టింది. అంతేకాదు. నా దృష్టిలో నేను చాల గొప్పగా నిర్వర్తించాననుకున్న ఒకానొక పని మరొకరి దృష్టికి అది అతి పేలవంగా, అతిసామాన్యమైనదిగా కన్పించే అవకాశం ఉంటుందని అర్థం చేసుకున్నాను. ఒక ఉద్యోగస్తురాలిగా నావిద్యార్థులకు నేనివ్వగలిగినంతా సమర్ధతో ఇవ్వడం నా బాధ్యత. నేను చేసిన కృషికి నాకు తగిన రీతిలో మెప్పులభించలేదని నేను నావిధులలో ఉదాసీనత చూపడం భావ్యం కాదు.

ఇప్పుడు నాకు ‘ Scope for improvement’ అనే మాటలకు క్రొత్త అర్థం బోధపడటమే కాదు, నా విధులు బాధ్యతలను అంకితభావంతో నెరవేర్చడానికి ఒక నూతనోత్సాహం కూడా లభించింది.
మంచి జీవితానికి అవసరమైన ఈ గుణపాఠం బోధించిన ఆ చిన్నారి చిట్టి విద్యార్థినికి ఎన్నో ఎన్నో ధన్యవాదాలు. మరెన్నో మనఃపూర్వక ఆశీస్సులు. ఒక ఉపాధ్యాయినిగా నా నైపుణ్యానికి కొత్త మెరుగులు సంతరించు కోవడంలో నిరంతరం కృషి చేస్తానని ఆ విద్యార్థినికి మాట ఇస్తున్నాను.

( ఉపాధ్యాయ దినం సందర్భంగా )

‘కలవారికోడలు కల…

‘కలవారికోడలు కలికి కామాక్షి’ అలనాటి ఉమ్మడికుటుంబ వ్యవస్థకి ఒక సజీవ సంక్షిప్త దృశ్య చిత్రం. ఆనాటి కుటుంబంలోని సభ్యులు, వారి బాధ్యతలు, వారి హక్కులు, పరస్పర ఆదర అభిమానాలు, అనురాగాలు, అనుకంపాలు అన్నీ ఈ పాటలో చోటు చేసుకున్నాయి. ఇంట్లో ఎంతమంది పెద్దలున్నా, పెత్తందారులున్నా, వారి అంగీకారం కోడలు కోరడంవారి పెద్దరికాన్ని గౌరవించడం కోసమే. వారు కూడా ఆమె కోరికను కాదనకుండా, కావలసిన అనుమతి అంతిమంగా ఎక్కడ లభిస్తుందో అన్యాపదేశంగా చెప్పడమే ఇందులోని చమత్కారం. అప్పటి కుటుంబాలలో తల్లిదండ్రులే కాదు, తాత ముత్తాతలు, బామ్మలు అమ్మమ్మలు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు, బావలు మరదులు, వదినలు మరదళ్లు, తోడికోడళ్లు తోడల్లుళ్లు, మేనల్లుళ్లు మేనకోడళ్లు, మేనమామలు మేనత్తలు, పినతల్లులు బాబయ్యలు – ఇంతేకాక వేలువిడిచిన వరుసలో వారు- ఇలా బంధువర్గంలోని ఎవరోఒకరు కుటుంబంలో మమేకమై తరతరాలుగా కలసి జీవించేవారు. కుటుంబంలో అందరికోసం ప్రతిఒక్కరు, ప్రతిఒక్కనికోసం అందరూ అవసరం పడితే తమ హక్కులను సుఖాలనూవదులుకునే జీవన విధానమది. ఒక్కముక్కలో చెప్పాలంటే నేటి ప్రజాస్వామ్యానికి ఒక చిన్న నమూనా ఆనాటి ఉమ్మడికుటుంబ వ్యవస్థ. ప్రసూతులూ, పసిపిల్లల పెంపకాలూ ఇళ్లలోనే. డే కేర్ సెంటర్లు, నర్సరీ స్కూళ్లు అవసరం అప్పుడుండేది కాదు. ఇంట్లోని మిగిలిన సభ్యులే పిల్లలకు కావలసిన జ్ఞానాన్ని వాళ్లకు కల్గించేవారు.
అయితే కాలం మారింది. అర్థవ్యవస్థలూ మారాయి. దీని కారణంగా కుటుంబ స్వరూపమే ఛిన్నాభిన్న మైంది. వ్యక్తుల స్వార్ధం వలన కొన్ని ఉమ్మడికుటుంబాలు పతనమైపోతే, కొన్ని ఉమ్మడికుటుంబాల క్రౌర్యం వలన చాలామంది వ్యక్తుల జీవితాలు నలిగిపోయాయి. ఇవే కథావస్తువులుగా అనేక సినిమాలు, నవలలు, కథానికలు గత అర్ధశతాబ్దంగా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి!
ఇప్పుడు ‘కలికి కామాక్షి’ కుటుంబం ఒక చారిత్రిక అంశం.

నేడు కొడుకూ కోడలితో కలసి ఉండే కుటుంబాలే చాలా తక్కువ. ఏ కోడలకూ నేడు కలికి కామాక్షికి వచ్చిన అవసరం రాదు. పైగా కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్న నేటి సమాజంలో నేటి యువతికి పుట్టింటికి వెళ్లడానికి అనుమతిని ‘కలికి కామాక్షి’ రీతిలో కోరవలసిన అగత్యం అంతకంటె లేదు. సెల్ చేతిలో ఉండగా ఒక call ద్వారానో లేక ఇ-మెయిల్ SMS ద్వారానో తెలియబరచ వచ్చు. భార్య పుట్టింటికి వెళ్తే తిండికి కటకటలాడే పరిస్థితి ఇప్పుడు లేదుకదా! మరికొంత కాలం పోతే సొంత వంటిళ్లు ఉండే ఇళ్ళు చారిత్రకాంశాలు ఔతాయి.
వంటిల్లు లేని ఇంటిని ప్రసాదించమని భగవంతుడిని వేడుకుంటోంది రాబోయే యువతరం. ఆహారావసరాలు కూడా out sourcing ద్వారా తీరబోతున్నాయి.
ఈ నేపథ్యంలో నేటి చిన్నపిల్లలకు ‘ కలవారి కోడలు కలికి కామాక్షి’ లాంటి పాటలు నేర్పటం లేదని, దాని భావాన్ని వాళ్లకు విడమర్చి చెప్పడంలేదని విచారించడం, వాపోవటం అంత సమంజసం కాదనిపిస్తోంది. కేవలం తెలుగులో నర్సరీరైమ్స్ మాదిరి భాషని నేర్పడానికైతే ఫరవాలేదు. ఐనా తెలుగు మాధ్యమంలో చదివేవాళ్లెంతమంది, మన పిల్లలనూ మనవలనూ తెలుగులో చదివించేవాళ్లం ఎంతమంది?
ఈమధ్య యునెస్కో హెచ్చరించింది :
” కనీసం 30 శాతం పిల్లలు తమ భాష నేర్వడం మానేస్తే ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్లే”- అని.

ఇవి గాయ చెప్పేగాథలు.
అక్కరకు రాని ఊహలు వేసే అడుగులు.
ఇవి అందరి మనసుల్లో తెరచుకున్న సమాధులు.

ఏమైనా మాకు
“గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదు”.

Quote

Politics and it’s many shades of grey.

You spot something good in a politician you reward him or her with a vote. You spot something bad you give your vote to somebody else. What if that somebody else is somewhat good and somewhat bad. What do you do? How do you choose between the various shades of grey?
The popularity way to handle this is to ‘ re-paint’. You make a choice, based on preferences. Then, you re-paint your party as white and call everyone as black. Whenever there’s a discussion on the strengths and weaknesses , you side with your club and call everyone the names. If you like Modi, call everyone else incompetent and pseudo-secular. Like Congress? Call everyone else communal. Like AAP? Call everyone else anything – corrupt, communal, biased, paid – because, well, AAP is perfect.
Really makes for a great thriving democracy, doesn’t it?
Instead of applying our minds to the task of choosing between shades of grey, we are being good citizens if we re-paint our choice.
Why do we do this? The main reason is human beings get extremely uncomfortable with uncertainty. In our personal life too, we find it easier to slot people as good or bad. No human being is completely good or totally bad. A good person may do some thing wrong in a lapse of judgement or given the circumstances. In the same way, there are no pure evil people on this earth.
………… …………
All political parties are a mixed, grey bag. They are this way because we Indians are a mixed grey bag. Let us choose one, but never let them feel that they are perfect. Let us reject another, but never let them feel they are entirely useless. Grey is tough to handle. But grey is life.
( — Chetan Bhagat.)